హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ'

AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారంలో ఇవాళ రైతులకు తహసీల్దార్ కాకర నూకరాజు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. భూములకు సంబంధించిన హక్కుల వివరాలు పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదవుతాయని తెలిపారు. వీటి ద్వారా రైతులకు తమ భూములపై హక్కులకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉంటాయని, భవిష్యత్తులో భూ సంబంధిత అవసరాలకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.