VZM: ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని ఎస్.కోట ఎస్సై నవీన్ పడాల్ కోరారు. ఇవాళ ఆయన ఎస్ కోట ఏజీఎల్ కాలేజీ వద్ద త్రిశూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పోక్సో, సైబర్ నేరాలు తదితర మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'


