హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.