NZB: జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ చెక్‌డ్యాం చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. గతేడాది వచ్చిన భారీ వరదలకు ధ్వంసం కాగా మరమ్మతుల కోసం అధికారులు రూ.1.20 కోట్ల నిధుల ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. చెక్‌డ్యాంలో నీరు లేకపోవడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఎడారిని తలపిస్తున్న కలిగోట్ చెక్‌డ్యాం


