హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ASF: బెజ్జూర్ మండలంలోని సల్గుపల్లి ప్రకృతి వనం మూలమలుపు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ అంబగట్ట ఉపసర్పంచ్‌ అనంతరావు మృతిచెందారు. ప్రమాదం అనంతరం ఆయనను మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది.