ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. డైనింగ్ హాళ్లు లేక చెట్ల కింద, వరండాల్లో తింటున్న పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల కుక్కలు, కోతుల బెడదతో విద్యార్థులు తీవ్ర భయూందోళనకు గురవుతున్నారు. భోజనశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
బడి పిల్లలకు సదుపాయాలు లేక అవస్థలు


