పెద్దపల్లి: మంథని డివిజన్ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పగటిపూట ఎండ వేడి, రాత్రి చల్లదనం, ఉదయం మంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో రహదారులు సరిగా కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.
తెలంగాణ
మంథని డివిజన్‌లో దట్టంగా పొగమంచు


