హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యకర్త మృతికి మాజీ ఎమ్మెల్యే నివాళి

SRPT: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పుట్టపాక రాంబాయమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు.