హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాతబస్తీలో కరెంట్ బకాయిలపై కొరడా!

హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ బిల్లుల బకాయిలు కోట్లకు చేరడంతో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సౌత్ సర్కిల్‌లో రూ.68.48 కోట్లు, చార్మినార్ డివిజన్‌లోనే రూ.35.18 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిదారులకు నోటీసులు ఇవ్వాలని, చెల్లించకపోతే పోలీసుల సాయంతో కనెక్షన్ కట్ చేయాలని సూచించారు.