హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి: మంత్రి

HNK: జమ్మూలో నిర్వహించిన అండర్-17 జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రజత పతకం సాధించి, వరల్డ్ యూత్ కామన్‌వెల్త్ పోటీలకు ఎంపికైన WCM, WFM టైటిల్ హోల్డర్ శివాంశికను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.