హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రోడ్డు ప్రమాదాల నివారణకు బోర్డులు ఏర్పాటు చేయాలి'

MBNR: జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లేందుకు వస్తున్న తల్లిదండ్రులు రోడ్డు దాటే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.