BHPL: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జొన్న, కూరగాయలు, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వేను వేగవంతం చేయాలని, నానో యూరియా, డీఏపీ వినియోగంపై ప్రచారం నిర్వహించాలన్నారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి: కలెక్టర్


