హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు తరగతి గదులు నిర్మించాలని కలెక్టర్‌కు వినతి

NZB: సాలూర ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను స్థానికులు కోరారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక చెట్ల కింద కూర్చుని పాఠాలు వినాల్సి వస్తోందని వాపోయారు. దీంతో పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలో భూ సర్వే నిమిత్తం పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను కలిసి స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు.