హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

విశాఖ: నగరంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో 'కార్డన్ సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. అడుగడుగునా జల్లెడ పడుతూ, ప్రతి ఇల్లు, దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 11 వాహనాలను సీజ్ చేశారు.