MDK: దామరచెరువు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు పెద్దమ్మ ఆలయంలో చొరబడి హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఆలయం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉండటంతోనే దొంగలు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తెలంగాణ
గుడి హుండీ పగులగొట్టి నగదు అపహరణ


