హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇకనుంచి 72 డివిజన్లతో గ్రేటర్ రాజమహేంద్రవరం?

తూ.గో: రాజమహేంద్రవరం ఇకనుంచి గ్రేటర్ రాజమహేంద్రవరంగా అవతరించనుంది. చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల విలీనంతో 50 డివిజన్ లుగా ఉన్న నగరం 72 డివిజన్ లకు చేరనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను నగర కమిషనర్ రాహుల్ మీనా ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. విలీన గ్రామాల సరిహద్దులు, జనాభా ప్రాతిపదికన డివిజన్ల విభజనకు సంబంధించిన తొలి నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది.