హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాబ్ మేళాకు విశేష స్పందన

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాలో 20 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలను అందించడం జరిగిందని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని విజయలక్ష్మి తెలిపారు. ఈ జాబ్ మేళాకు జిల్లా నుండి నిరుద్యోగ అభ్యర్థులు 60 మంది హాజరయ్యారని, వీరిలో మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా 20 మందిని ఎంపిక చేసామని తెలిపారు. త్వరలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు.