హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవరాత్రి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి'

SRPT: దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు నడిగూడెం ఎస్సై తేజస్విని కీలక సూచనలు చేశారు. మండపాల ఏర్పాటుకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. రహదారులకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలు, అశ్లీల పాటలు,నృత్యాలకు అనుమతి లేదన్నారు. ప్రమాదాలు జరగకుండా మండపాల వద్ద పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.