హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రాత్రివేళ పోలీసుల నిఘా..!

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఏటీఎంలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, జిల్లా సరిహద్దుల్లో భద్రతను పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.