హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం కోసం మంచాలు వేశారు..!

ప్రకాశం: సీఎం చంద్రబాబు మరికొన్ని గంటల్లో ప్రకాశం జిల్లాకు రానున్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలులో రచ్చబండ పేరిట కార్యక్రమం జరగనుంది. చాలా మంది రైతులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. దీంతో అధికారులు మంచాలు సిద్ధం చేశారు. రైతులతో మాటామంతి ముగిశాక బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. తర్వాత కార్యకర్తల భేటీ ఉంటుందని టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరు రవీంద్ర తెలిపారు.