హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి

KMM: వేంసూరు మండలం కందుకూరు–వెంకటాపురం గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కందుకూరుకు చెందిన ఐటీ ఉద్యోగి మందపాటి సంతోశ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.