హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీపార్వతీ సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు!

SRD: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ​ఝరాసంగం శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం ఉదయం అర్చకులు భృగువాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి అభిషేకాలు, విశేష అలంకరణలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.