GNTR: రీల్స్ ప్రమోషన్ పేరుతో మహిళను లాడ్జికి పిలిచి, మత్తు పదార్థం కలిపిన నీరు ఇచ్చి అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసినట్లు పోలీసులు తెలిపారు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.15,800 ఫోన్‌పే చేయించుకున్నట్లు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు నిందితుడు షేక్ జానీ అలియాస్ సిద్దీక్‌ను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రీల్స్' పేరుతో దారుణం.. వ్యక్తి అరెస్ట్!


