ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తోంది. తెల్లవారుజామున పరిసర ప్రాంతాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపించాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా ఇంత దట్టంగా మంచు కురుస్తుండటంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. మంచు తెరలతో ఏజెన్సీ ప్రాంతం పర్యాటక ప్రాంతమైన ఊటీని తలపిస్తోంది. చల్లని వాతావరణం, మంచు అందాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ
మంచుదుప్పటి కప్పుకొన్న ఏటూరునాగారం ఏజెన్సీ


