హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో సైబర్ మోసం

SRCL: వేములవాడ ఆర్టీవో అధికారినంటూ ఫోన్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ పేరుతో రూ.4,200 కాజేసిన నీరటి తిరుమల్‌ను వేములవాడ గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. లైసెన్స్ బ్లాక్ అవుతుందని భయపెట్టి, గొంతు మార్చి మరో అధికారి మాట్లాడుతున్నట్లు నమ్మించి డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. నిందితుడి నుంచి రెండు సిమ్ కార్డులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.