హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసిఫాబాద్‌లో వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం

ASF: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్‌ను ప్రారంభించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలు,చిరునామా, ఆధారాల ఫొటోలతో కలిపి 7569986036 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చు.అయితే, ఈ నంబర్‌కు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయరాదని అధికారులు స్పష్టం చేశారు.ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.