హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సంగారెడ్డిలో భానుడి ప్రతాపం

​SRD: సంగారెడ్డి జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నేడు రోజంతా వాతావరణం పొడిగా ఉండి, పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వర్ష సూచనలు లేకపోవడంతో మధ్యాహ్నం ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు.