హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వర్మీకంపోస్టు తయారీపై అవగాహన

తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల సముదాయం వద్ద వర్మీకంపోస్టు తయారీపై ఇవాళ అన్ని పంచాయతీల్లోని గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులకు అవగాహన కల్పించనున్నట్లు ఎంపీడీవో నారాయణ తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గ్రామాల్లో సేకరించే తడి చెత్తను సమర్థవంతంగా నిర్వహించి, దానిని ఉపయోగకరమైన వర్మీకంపోస్టుగా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం.