PDPL: సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లికి వెళ్లే మార్గంలోని కనుకుల కూడలి వద్ద బీటీ రోడ్డు గుంతలమయమైంది. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలతో పాటు గ్రానైట్ లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారి తరచూ దెబ్బతింటోంది. గుంతల కారణంగా రాత్రివేళ ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారితో వాహనదారుల ఇబ్బందులు


