హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ రీసర్వేను పరిశీలించిన ఆర్డీవో

అన్నమయ్య: గాలివీడు మండలంలోని తలముడిపి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. రైతుల భూముల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతుల్లో ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలత, డిప్యూటీ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.