MDK: హవేలిఘనపూర్(మం) కొచ్చెరుతండా ప్రాథమిక పాఠశాల ఒకే భవనంలో బడి, పంచాయతీ, అంగన్‌వాడీ, రేషన్ షాపు నిర్వహిస్తున్నారు. పంచాయతీ సమావేశాలు, రేషన్ పంపిణీ వేళ విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. దీంతో 28 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక భవనాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఒకే భవనం.. నాలుగు సేవలు


