హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు

విశాఖ: జిల్లా విద్యాశాఖ, NTPC ఆధ్వర్యంలో ఇవాళ  పాఠశాలల్లో పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు గ్రూప్‌-ఏ, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గ్రూప్‌-బి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ‘ఇంట్లో, పాఠశాలలో విద్యుత్ ఆదా’ అనే అంశంపై చిత్రాలు వేయాలని డీఈవో ప్రేమ్‌కుమార్ సూచించారు.