హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బర్త్ డే వేడుకలో గొడవ..చివరికి..!

ఏలూరు: పట్టణంలో బర్త్ డే వేడుక విషాదంగా మారింది. పాలాస్పేట తూర్పువీధికి చెందిన పరాపర్రావు (44) ఈనెల 1న బర్త్ డే ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ కుటుంబ కలహాల నేపథ్యంలో రిషుక్ కుమార్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. భార్య బేబీ దుర్గ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.