హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు భూ సమస్యల పరిష్కార వేదిక..!

KDP: సింహాద్రిపురం, తొండూరు మండలాల రైతుల భూ సమస్యల పరిష్కారానికి శుక్రవారం తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక వేదిక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరుకానున్నట్లు తహసీల్దార్లు మధురవాణి, అనురాధ తెలిపారు. రెండు మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.