MHBD: పెద్దవంగర మండలం అవుతాపురంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 8 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పద్మ, ఐలయ్య దంపతులు ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బంగారాన్ని అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు, గురువారం యాకయ్య వ్యక్తిని అరెస్టు చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గణేష్ తెలిపారు.
తెలంగాణ
చోరీ కేసును ఛేదించిన పోలీసులు


