హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే సీనియర్ ఖోఖో జట్టు ఎంపికలు

కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా (పెద్దపల్లి మినహా) సీనియర్ ఖోఖో జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 10న రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. క్రీడాకారులు ఆధార్ జిరాక్స్‌తో హాజరుకావాలని కార్యదర్శి మహేందర్‌రావు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.