హైదరాబాద్: 28°C
తెలంగాణ

శభాష్‌పల్లికి టీబీ రహిత గ్రామంగా గుర్తింపు

SRCL: వేములవాడ అర్బన్‌ మండలం శభాష్‌పల్లి గ్రామం టీబీ రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గురువారం కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ గ్రామ సర్పంచ్‌, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. గ్రామస్థుల సహకారంతో ఆరోగ్య పరిరక్షణ, పుస్తక పఠనం, వ్యాయామంపై అవగాహన కల్పిస్తూ టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దినట్లు యాదవ్‌ తెలిపారు.