హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులకు వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలి: TUCI

NRPT: ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని TUCI డివిజన్ నాయకుడు కాశీనాథ్ డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట జిల్లా ఆసుపత్రి కార్యాలయంలో డాక్టర్ బాలాజీకి వినతి పత్రం అందజేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ పోను రావాల్సిన రూ.12,093 బదులుగా కాంట్రాక్టర్ కేవలం రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.