హైదరాబాద్: 28°C
తెలంగాణ

బార్ అండ్ రెస్టారెంట్‌కు నోటిఫికేషన్

NZB: బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి నందగోపాల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ. 1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జతపరిచి ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ బార్‌కు సంబంధించి వార్షిక లైసెన్స్ రుసుము రూ.42 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు.