HNK: రంగశాయిపేట ఆర్డీవో ఆఫీస్ జంక్షన్‌లో 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జాప్యం లేకుండా, నాణ్యతతో గడువులోపు పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల పరిశీలన


