2016లో తనను భారత జట్టు డైరెక్టర్ పదవి నుంచి తప్పించడం తీవ్రంగా బాధించిందని రవిశాస్త్రి తెలిపాడు. రెండేళ్లపాటు జట్టు కోసం ఎంతో కృషి చేసినా, తనను కాదని అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశారని గుర్తుచేసుకున్నాడు. పైగా, తన ఇంటర్వ్యూ సమయంలో సౌరభ్ గంగూలీ గైర్హాజరు కావడం మరింత వేదనకు గురిచేసిందని పేర్కొన్నాడు.
క్రీడలు
డైరెక్టర్‌గా తప్పించడం బాధించింది: రవిశాస్త్రి


