హైదరాబాద్: 28°C
వ్యాపారం

PAYTM బ్యాంక్‌కు షాకిచ్చిన RBI

పేటీఎంకు అనుబంధంగా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఈ బ్యాంక్‌ను షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలు చేసింది. నిబంధనల ఉల్లంఘించడంతో పాటు బ్యాంక్ డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కార్యకలాపాలు సాగుతున్నాయని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.