హైదరాబాద్: 28°C
తెలంగాణ

సవాళ్ల మధ్య మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం

KMM: మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. రెండు దశల్లో ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. మొదట 16,180 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అయితే గొందిగూడెం పరిధిలోని మారెళ్లపాడు వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి, గోదావరి జలాలను ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. తొలి దశగా తుమ్మలచెరువుకు గోదావరి జలాలను తరలించే పనులు చేపట్టారు.