హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్లో పత్తి, మిర్చి ధరల వివరాలు..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో గురువారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.8,490 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.25,800 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.32 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.21,500, టమాటా మిర్చి రూ.38 వేలు ధర పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.