హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైద్య సదుపాయం కల్పించాలి'

VZM: తమకు వైద్య సదుపాయం అందించాలని వేపాడ మండలం కేజీ పూడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 కుటుంబాల ప్రజలు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో వైద్య సదుపాయం లేక బయట ఆసుపత్రులకు వెళితే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో జ్వరాలు తగ్గే వరకు వైద్య సదుపాయం అందించాలని కోరుతున్నారు.