హైదరాబాద్: 28°C
తెలంగాణ

భువనగిరిలో దోమల బెడద

BHNG: భువనగిరి పట్టణంలోని 35 వార్డుల్లో దోమల ఉద్ధృతి పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి తటాకాలు, మురుగు గుంతలతో దోమలు విజృంభిస్తున్నాయి. నియంత్రణకు ఏటా రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నా ఫలితం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.