ATP: గుత్తిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పురుషోత్తం, భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనం గుంతకల్ నుంచి గుత్తి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి


