VKB: వికారాబాద్ మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు అవసరమైన మేర కుసుమ విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి జి. ప్రసన్న లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డిపేట పీఏసీఎస్ సీఈవో బండి రెడ్డి, డైరెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
రైతులకు కుసుమ విత్తనాల పంపిణీ..!


