హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్‌లో భారీ 'కార్డాన్ అండ్ సెర్చ్'

అనంతపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని గుంతకల్ డీఎస్పీ బి. శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం తెల్లవారుజామున 180 మంది సిబ్బందితో గంగానగర్, షికారి కాలనీ పరిసరాల్లో భారీ 'కార్డాన్ అండ్ సెర్చ్' నిర్వహించారు. రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేసి, గంజాయి విక్రయాలు, అక్రమ ఆయుధాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.