SRD: నాణ్యమైన విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని, మోటర్లు కాలిపోతున్నాయని నిజాంపేట ర్యాలమడుగు రైతులు జాతీయ రహదారిపై గురువారం ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి తమ పంటలను కాపాడాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కరెంటు కష్టాలపై రైతుల ధర్నా!


